Where is Helmet: హెల్మెట్ లేకుండా బైకుపై అమితాబ్ బచ్చన్, అనుష్క శర్మ, చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన నెటిజన్లు

దీంతో ఓ బైకర్‌ను లిఫ్ట్‌ అడిగి ఆయన లొకేషన్‌కు చేరుకున్నారు. నటి అనుష్క శర్మ కూడా ట్రాఫిక్‌ రద్దీ కారణంగా తన బాడీగార్డ్‌తో కలిసి బైక్‌పై లొకేషన్‌కు వెళ్లింది

Mumbai Traffic Police Takes Note Of Amitabh Bachchan, Anushka Sharma's Helmet-Less Pics

రెండు రోజుల క్రితం బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ షూటింగ్‌ కు వెళ్తూ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయిన విషయం తెలిసిందే. దీంతో ఓ బైకర్‌ను లిఫ్ట్‌ అడిగి ఆయన లొకేషన్‌కు చేరుకున్నారు. నటి అనుష్క శర్మ కూడా ట్రాఫిక్‌ రద్దీ కారణంగా తన బాడీగార్డ్‌తో కలిసి బైక్‌పై లొకేషన్‌కు వెళ్లింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

అయితే బైక్‌పై వెళ్తున్న సమయంలో వారు హెల్మెట్‌ ధరించకపోవడం విమర్శలకు తావిచ్చింది. దీంతో నెటిజన్లు వారిద్దరి ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ.. ‘హెల్మెట్‌ ఎక్కడ?’ అంటూ ప్రశ్నిస్తున్నారు. చట్టం, నిబంధనలు సామాన్యులకేనా? అని నిలదీస్తున్నారు. కొంత మంది ఈ ఫొటోలను ముంబయి ట్రాఫిక్‌ పోలీసులకు ట్యాగ్‌ చేసి ‘చర్యలు తీసుకోవాలి’ అని కోరుతున్నారు. నెటిజన్ల పోస్టులకు పోలీసులు స్పందించారు. ‘‘చర్యలు తీసుకునేందుకు కచ్చితమైన లొకేషన్‌ వివరాలను అందజేయండి’’ అని నెటిజన్లను కోరారు.

Here's Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)