Naa Saami Ranga Song Out: నా సామిరంగా నుంచి బ్యూటిపుల్ మెలోడీ సాంగ్ ఇదిగో, 'ఇంకా ఇంకా దూరమే మాయమవుతుంటే అంటూ సాగుతున్న పాట
నాగార్జున కథానాయకుడిగా విజయ్ బిన్నీ రూపొందించిన సినిమానే 'నా సామిరంగా'. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ కథానాయికగా అలరించనుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను ఈ నెల 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.
'ఇంకా ఇంకా దూరమే మాయమవుతుంటే .. ఇంకా ఇంకా ప్రాణమే దగ్గరవుతుంటే ..' అంటూ ఈ పాట సాగుతోంది. నాగార్జున - ఆషిక రంగనాథ్ కాంబినేషన్లో .. గ్రామీణ వాతావరణంలో చిత్రీకరించిన పాట ఇది. కీరవాణి స్వరపరిచిన ఈ పాటను మమన్ కుమార్ - సత్య యామిని ఆలపించారు. అల్లరి నరేశ్ సరసన మిర్నా .. రాజ్ తరుణ్ జోడీగా రుక్సార్ థిల్లాన్ కనిపించనున్నారు.
Here's Song
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)