Bimbisara Trailer: ప్రభాస్‌ బాహుబలిని తలపిస్తున్న కళ్యాణ్ రామ్, రాక్షసులెరుగని రావణ రూపం.. శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం అంటూ ఆకట్టుకుంటున్న బింబిసార ట్రైలర్

శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం.. త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుని విశ్వరూపం.. అంటూ కథానాయకుడి పాత్రను పరిచయం చేశారు

Nandamuri Kalyan Ram's Bimbisara Trailer Out

నందమూరి కల్యాణ్‌ రామ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం బింబిసార ట్రైలర్ విడుదలైంది. కేథరిన్‌, సంయుక్త మీనన్‌, వారీనా హుసేన్‌ హీరోయిన్లుగా కనిపించనున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై హరికృష‍్ణ. కె నిర‍్మిస్తున్న ఈ సినిమాకు 'ఏ టైమ్‌ ట్రావెల్‌ ఫ్రమ్‌ ఈవిల్‌ టు గుడ్‌' అనేది ఉపశీర్షిక. వశిష్ట్‌ దర‍్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల రిలీజైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది.

రాక్షసులెరుగని రావణ రూపం.. శత్రువులు గెలవలేని కురుక్షేత్ర యుద్ధం.. త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుని విశ్వరూపం.. అంటూ కథానాయకుడి పాత్రను పరిచయం చేశారు. 'బింబిసారుడంటేనే మరణ శాసనం. ఇక్కడ రాక్షసుడైనా, భగవంతుడైనా ఈ బింబిసారుడొక్కడే..', 'పట్టుమని వంద మంది కూడా లేరు, ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు', 'ఎవడ్రా నిన్ను పంపింది అని పైనున్న ఆ యముడు అడిగితే చెప్పు, కింద ఒకడున్నాడు.. వాడి పేరు బింబి, త్రిగర్తల సామ్రాజ్యాధిపతి బింబిసారుడని చెప్పు..' అంటూ కల్యాణ్‌ రామ్‌ డైలాగ్స్‌తో గర్జించాడు. మొత్తానికి పవర్‌ఫుల్‌ యాక్షన్‌తో కల్యాణ్‌ రామ్‌ అదరగొట్టాడు. ఈ సినిమా ఆగస్టు 5న విడుదల కానుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)