Note Ban-Bichagadu: నోట్ల రద్దుకు, ‘బిచ్చగాడు’ సినిమాకి లింకేంటి?.. 2016లో వచ్చిన బిచ్చగాడు.. అదే ఏడాది పెద్ద నోట్ల రద్దు.. రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటామని ప్రకటించిన ఆర్ బీఐ.. అదే రోజున రిలీజ్ అయిన బిచ్చగాడు 2.. ఇక నెటిజన్ల కామెంట్లు చూస్కోండి!!
2016లో విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన ‘బిచ్చగాడు’ సినిమా సూపర్ హిట్ అయింది. తమిళంలోనే కాదు తెలుగులోనూ రికార్డు కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ‘బిచ్చగాడు 2’ రిలీజ్ అయింది. అయితే నెటిజన్లు బిచ్చగాడు సినిమాకు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయానికి ముడిపెడుతున్నారు.
Hyderabad, May 21: 2016లో విజయ్ ఆంటోని (Vijay Antony) హీరోగా వచ్చిన ‘బిచ్చగాడు’ (Bichagadu) సినిమా సూపర్ హిట్ అయింది. తమిళంలోనే కాదు తెలుగులోనూ రికార్డు కలెక్షన్లు (Record Collections) రాబట్టింది. తాజాగా ‘బిచ్చగాడు 2’ రిలీజ్ అయింది. అయితే నెటిజన్లు బిచ్చగాడు సినిమాకు, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయానికి ముడిపెడుతున్నారు. తెలుగులో 2016 మే 13న బిచ్చగాడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తర్వాత సుమారు ఐదారు నెలలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. మొన్న‘బిచ్చగాడు 2’ సినిమా రిలీజ్ అయింది. అదే రోజే రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బీఐ) ప్రకటించింది. రెండు సంఘటనలూ యాదృచ్ఛికంగానే జరిగినా.. రెండింటికీ ముడిపెడుతూ.. సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. కొంత మంది సరదాగా కామెంట్లు చేస్తున్నారు. వాటిని మీరూ చూడండి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)