Akshar Patel brings BACK to BACK wickets (X)

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా అదరగొడుతోంది(India vs Bangladesh LIVE Score). టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. పది ఓవర్లలోపే ఐదు వికెట్లు తీశారు. ముఖ్యంగా అక్షర్ పటేల్(Akshar Patel) తన తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్ మిస్ చేసుకున్నాడు. వరుస బంతుల్లో 2 వికెట్లు తీయగా హ్యాట్రిక్ బాల్ సైతం క్యాచ్ రాగా రోహిత్ చేతిలో పడ్డ క్యాచ్‌ని మిస్ చేశారు.

తొలి ఓవర్లో షమీ షాకివ్వగా, రెండో ఓవర్లో హర్షిత్ రాణా బంగ్లా కెప్టెన్ శాంటోను పెవిలియన్ చేర్చాడు. దీంతో బంగ్లా 2 ఓవర్లు ముగిసే సరికి 2 పరుగులు మాత్రమే చేసి, 2 వికెట్లు కోల్పోయింది. 21 సంవత్సరాల తర్వాత బంగ్లాదేశ్ షకీబ్ అల్ హసన్ లేకుండా ఏదైనా ICC ఈవెంట్‌లో బరిలోకి దిగింది.

వీడియో ఇదిగో, అంపైర్ తల పగలగొట్టబోయిన న్యూజిలాండ్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్, తృటిలో తప్పిన పెను ప్రమాదం, అసలేం జరిగిందంటే..

బంగ్లాదేశ్ జట్టు

బంగ్లాదేశ్ : తాంజిద్ హసన్, సౌమ్య సర్కార్, నజ్ముల్ హొస్సేన్ శాంటో(కెప్టెన్), తౌహిద్ హృదయ్, ముష్ఫికర్ రహీమ్(కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, జాకర్ అలీ, రిషాద్ హొస్సేన్, తంజిమ్ హసన్ సకీబ్, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్.

Akshar Patel brings BACK to BACK wickets

టీమిండియా

భారత్ : రోహిత్ శర్మ(సి), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(w), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్.