ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా ఆతిథ్య పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌ మధ్య కరాచీ వేదికగా తొలి మ్యాచ్‌ (ICC Champions Trophy 2025) జరుగుతున్నది. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ భారీ స్కోరు సాధించింది.న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 320 పరుగులు భారీ స్కోరును సాధించింది. ఈ మ్యాచ్ సందర్భంగా గ్లెన్ ఫిలిప్స్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు దాదాపుగా అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరోను (Glenn Phillips Almost Hits Umpire Richard Kettleborough) కొట్టబోయాడు.

కేన్ విలియమ్సన్ వికెట్ వీడియో ఇదిగో, నసీమ్ షా అద్భుతమైన డెలివరీకి కీపర్ చేతికి చిక్కిన మాజీ కెప్టెన్

నసీమ్ షా వేసిన ఐదవ బంతిని గ్లెన్ ఫిలిప్స్ సింగిల్ కొట్టిన తర్వాత 46వ ఓవర్‌లో ఇది జరిగింది. ఆ ఓవర్ లో అతను బంతిని షాట్ కొట్టబోయాడు. అయితే అది సరిగా తగలకపోవడంతో సింగిల్ పరుగు వచ్చింది. ఇక ఆ బంతి నుండి మెరుగైన కనెక్షన్‌ను ఏర్పరచుకోవాలని, ఒకటి కంటే ఎక్కువ పరుగులు సాధించేవాడినంటూ ఆలోచనలో బ్యాటర్ షాట్‌ను మళ్లీ ప్రాక్టీస్ చేస్తున్నట్లు కనిపించాడు. అయితే అతను అంపైర్‌కు చాలా దగ్గరగా ఉన్నాడని గమనించలేదు. దీంతో షాట్ రీ ప్రాక్టీస్ చేస్తూ బ్యాట్ ను దాదాపుగా అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో తల దగ్గరకు పోనిచ్చాడు. అయితే అంపైర్ తృటిలో తప్పించుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అయింది.

Glenn Phillips Almost Hits Umpire Richard Kettleborough

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)