MATKA: వరుణ్ తేజ్ ‘మట్కా’లో స్పెషల్ ఐటం సాంగ్.. నర్తించనున్న బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి.. పోస్టర్ వైరల్..!

పలాస 1978 ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ మట్కా. పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

MATKA

Hyderabad, July 23: పలాస 1978 ఫేమ్ కరుణకుమార్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ (Varun Tej) నటించిన లేటెస్ట్ మూవీ మట్కా (Matka). పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకొంది. ఈ సినిమా తాజా షెడ్యూల్ ఆర్‌ఎఫ్‌సీలో పూర్తయినట్లు చిత్రబృందం తెలిపింది. ఈ విషయాన్ని తెలియజేస్తూనే.. సినిమాలో నటించిన బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి (Nora Fatehi) లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ లుక్ ఐటం సాంగ్ కు సంబంధించినదిగా అర్థమవుతుంది. కాగా ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

భర్తకు విడాకులు ఇవ్వకుండా పెళ్లి ప్రామిస్‌తో ప్రియుడితో శృంగారం, కీలక వ్యాఖ్యలు చేసిన అలహాబాద్ హైకోర్టు

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement