Cool Jayanth Passes Away: సినీ పరిశ్రమలో మరో విషాదం, క్యాన్సర్‌తో ప్రముఖ సినీ నృత్య దర్శకుడు కూల్ జయంత్ కన్నుమూత, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ నృత్య దర్శకుడు కూల్ జయంత్ (44)బుధవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ప్రభుదేవా, రాజు సుందరం వద్ద పలు చిత్రాలకు డాన్సర్‌గా పని చేసిన కూల్ జయంత్ సుమారు 800 చిత్రాలకు పైగా డాన్సర్‌గా పని చేశారు.
సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. సినీ నృత్య దర్శకుడు కూల్ జయంత్ (44)బుధవారం ఉదయం చెన్నైలో కన్నుమూశారు. ప్రభుదేవా, రాజు సుందరం వద్ద పలు చిత్రాలకు డాన్సర్‌గా పని చేసిన కూల్ జయంత్ సుమారు 800 చిత్రాలకు పైగా డాన్సర్‌గా పని చేశారు. అనంతరం కాదల్ దేశం చిత్రం ద్వారా నృత్య దర్శకుడిగా పరిచయమయ్యారు. తమిళం, మలయాళం భాషల్లో సుమారు 100కు పైగా చిత్రాలకు నృత్య దర్శకుడిగా పని చేశారు.
మలయాళంలో మమ్ముట్టి, మోహన్‌లాల్ వంటి ప్రముఖ నటుల చిత్రాలకు కూల్ జయంత్ నృత్య దర్శకత్వం వహించారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఈయన బుధవారం ఉదయం స్థానిక వెస్ట్ మాంబళంలోని స్వగృహంలో కన్నుమూశారు. ఈయన మృతిపై పలువురు తమిళ, మలయాళ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)