Radhe Shyam Trailer: రాధేశ్యామ్ థియేట్రికల్ ట్రైలర్ విడుదల, హస్త సాముద్రికా నిపుణుడి పాత్రలో ప్రభాస్

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ థియేట్రికల్ ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ విలక్షణ కథా చిత్రం రాధేశ్యామ్ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Prabhas 20 First Look (Photo Credits: Instagram)

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధేశ్యామ్ థియేట్రికల్ ట్రైలర్ నేడు రిలీజ్ అయింది. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ విలక్షణ కథా చిత్రం రాధేశ్యామ్ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. రిలీజ్ కు ముందు అభిమానుల సంబరాలకు తాజా ట్రైలర్ తో తెర లేచింది. ఈ చిత్రంలో ప్రభాస్ హస్త సాముద్రికా నిపుణుడి పాత్రలో కనిపించనున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీతో పాటు థ్రిల్ కు గురిచేసే అనేక అంశాలు ఇందులో ఉన్నాయని ట్రైలర్ చెబుతోంది. ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించాడు.

మనం ఆలోచిస్తున్నామని భ్రమపడతాం. మన ఆలోచనలు కూడా ముందే రాసి ఉంటాయి’అని ప్రభాస్‌ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ ప్రారంభమవుతోంది. ‘చేయి చూసి ఫ్యూచర్‌ని, వాయిస్‌ విని పాస్ట్‌ని కూడా చెప్పేస్తావా అని ఒకరు ప్రభాస్‌ని అడగ్గా.. ‘విని ఎలా ఎప్పుడు చనిపోతాడో చెప్పనా ’అని ప్రభాస్‌  బదులిస్తాడు.  ‘ఇంకోసారి చెయ్యి చూడు’ అని జగపతి బాబు అడగ్గా..  నాకు రెండో సారి చెయ్యి చూడడం అలవాటు లేదు అంటూ ప్రభాస్ చెప్పే డైలాగ్‌  బాగా పేలింది. అలాగే ట్రైలర్‌ చివర్లో  ‘ప్రేమ విషయంలో  ఆదిత్య ప్రెడిక్షన్ తప్పు’ అని పూజా హెగ్డే చెప్పిన డైలాగ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement