Praveen Kumar Sobti Dies: మ‌హాభార‌త్ నటుడు ప్ర‌వీణ్ కుమార్ సోబ్తీ క‌న్నుమూత, హార్ట్ ఎటాక్ రావ‌డంతో తుది శ్వాస విడిచారని తెలిపిన ఆయన కుమార్తె నికునికా

మ‌హాభార‌త్ సీరియ‌ల్‌లో భీముడి పాత్ర పోషించిన న‌టుడు ప్ర‌వీణ్ కుమార్ సోబ్తీ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 75 ఏళ్లు. సోమ‌వారం రాత్రి 9.30 నిమిషాల‌కు త‌న తండ్రి ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆయ‌న కుమార్తె నికునికా తెలిపారు. హార్ట్ ఎటాక్ రావ‌డంతో ఆయ‌న తుదిశ్వాస విడిచారు

Praveen Kumar Sobti (file photo)

మ‌హాభార‌త్ సీరియ‌ల్‌లో భీముడి పాత్ర పోషించిన న‌టుడు ప్ర‌వీణ్ కుమార్ సోబ్తీ క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌సు 75 ఏళ్లు. సోమ‌వారం రాత్రి 9.30 నిమిషాల‌కు త‌న తండ్రి ప్రాణాలు కోల్పోయిన‌ట్లు ఆయ‌న కుమార్తె నికునికా తెలిపారు. హార్ట్ ఎటాక్ రావ‌డంతో ఆయ‌న తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలోని స్వంత ఇంట్లోనే ఆయ‌న ప్రాణాలు కోల్పోయారు. బీఆర్ చోప్రా తీసిన మ‌హాభార‌త్ సిరీయ‌ల్‌లో భీముడి పాత్ర‌తో ప్ర‌వీణ్ దేశ‌వ్యాప్తంగా స్టార్ అయ్యాడు. ప్ర‌వీణ్‌కు అర్జున్ అవార్డు కూడా ద‌క్కింది. బోర్డ‌ర్ సెక్యూర్టీ ఫోర్స్‌లో అత‌ను డిప్యూటీ క‌మాండెంట్‌గా ప‌నిచేశాడు. 2013లో ఆమ్ ఆద్మీ టికెట్‌పై ఢిల్లీ అసెంబ్లీలో పోటీప‌డ్డాడు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now