Prabhas in home Quarantine: హోం క్వారంటైన్‌‌లోకి ప్రభాస్, వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌కు కరోనా, ఆగిపోయిన రాధేశ్యామ్‌ చిత్రం షూటింగ్

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ హోం ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయాడు. ఆయన వ్యక్తిగత మేకప్ ఆర్టిస్ట్‌కు కరోనా సోకింది. దీంతో ముందు జాగ్రత్తగా ప్రభాస్‌కు కూడా ఐసోలేషన్‌లోకి వెళ్లాడు. దీంతో రాధే శ్యామ్ చిత్రం షూటింగ్ ఆగిపోయింది.

Happy Birthday Prabhas.

కాగా ప్రభాస్‌ చేతినండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న రాధేశ్యామ్‌ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకోంటుంది. చివరి షెడ్యూల్‌ మాత్రమే మిగిలుంది. ఇందులో భాగంగా ఓ పాటతోపాటు కొన్ని సీన్లు మాత్రమే షూట్‌ చేయాల్సి ఉంది. వీటి అనంతరం, ఆదిపురుష్‌, సలార్‌ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉన్నాయి. అయితే తాజాగా ప్రభాస్‌ క్వారంటైన్‌లోకి వెళ్లడంతో షూటింగ్‌కు కాస్తా బ్రేక్‌ పడింది. అంతేగాక ప్రభాస్‌తోపాటు మొత్తం రాధేశ్యామ్‌ చిత్రయూనిట్‌ అంతా కూడా సెల్ప్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు సమాచారం.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now