Rajinikanth: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాదాలకు నమస్కరించిన రజనీకాంత్.. వైరల్ వీడియో ఇదిగో..
ఈ సందర్భంగా యోగి పాదాలకు సూపర్ స్టార్ నమస్కరించారు. రజనీ కారులో నుండి దిగే సమయానికే యోగి ఆహ్వానం పలికేందుకు బయట ఉన్నారు.
Newdelhi, Aug 20: సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి (UP CM) యోగి ఆదిత్యనాథ్‌ను (Yogi Adityanath) లక్నోలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా యోగి పాదాలకు సూపర్ స్టార్ నమస్కరించారు. రజనీ కారులో నుండి దిగే సమయానికే యోగి ఆహ్వానం పలికేందుకు బయట ఉన్నారు. రెండు చేతులతో నమస్కరించిన సూపర్ స్టార్ ఆ వెంటనే ఆయన పాదాలకూ నమస్కరించారు. సీఎం యోగి, ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య తదితరులతో కలిసి తన జైలర్ సినిమాను చూసేందుకు రజినీ లక్నోకు వచ్చారు. సినిమా హిట్ కావడం అంతా దేవుడి దయ అన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)