RGV New Web Series: రకరకాల భార్యలు, వర్మ కొత్త వెబ్ సిరీస్ ఇదే, యూ ట్యూబ్ వేదికగా ప్రోమో విడుదల వివాదాస్పద దర్శకుడు, కీలకపాత్రలో కనిపించనునన్న 30 వెడ్స్‌ 21’ ఫేమ్‌ చైతన్య

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘రకరకాల భార్యలు’ పేరిట వెబ్ సిరీస్ రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు యూ ట్యూబ్ వేదికగా ప్రోమో విడుదల చేశారు. ఇప్పటి కాలంలో ఉన్న 8 రకాల భార్యలను గురించి అందరికీ తెలియచేస్తూ.. సిరీస్ లోని ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోరకం భార్యను చూపించనున్నట్లు ఆయన తెలిపారు.

RGV New Web Series (Photo-Twitter/varma)

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘రకరకాల భార్యలు’ పేరిట వెబ్ సిరీస్ రూపొందించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు యూ ట్యూబ్ వేదికగా ప్రోమో విడుదల చేశారు. ఇప్పటి కాలంలో ఉన్న 8 రకాల భార్యలను గురించి అందరికీ తెలియచేస్తూ.. సిరీస్ లోని ఒక్కో ఎపిసోడ్ లో ఒక్కోరకం భార్యను చూపించనున్నట్లు ఆయన తెలిపారు. మగవాడికి ఎలాంటి రకం భార్య దొరికితే జీవితం ఎలా మారుతుందో చెప్పడమే ఈ సిరీస్ ఉద్దేశమన్నారు.

త్వరలో పట్టాలెక్కనున్న ఈ సిరీస్‌లో ‘30 వెడ్స్‌ 21’ ఫేమ్‌ చైతన్య కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా ఆర్జీవీ ఓ ప్రమోషనల్‌ వీడియో షేర్‌ చేశారు. ‘ఎంతోమంది మహాకవులు స్త్రీల స్వరూపాన్ని వివిధ రకాలుగా అభివర్ణించారు.. కానీ కాలమానంలో ఎన్నో రకాలైన స్త్రీలు ఉద్భవిస్తారనే విషయాన్ని వాళ్లు గ్రహించలేకపోయారు’ అని ఆర్జీవీ అన్నారు. ఇప్పటికాలంలో ఉన్న భార్యల గురించి అందరికీ తెలియజేస్తూ ‘రకరకాల భార్యలు’ అనే పేరుతో సిరీస్‌ తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు. సిరీస్‌లోని ఒక్కో ఎపిసోడ్‌లో ఒక్కోరకం భార్యని చూపించనున్నట్లు వివరించారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now