Ram Gopal Varma: త్వరలో కేసీఆర్ బయోపిక్, సంచలన వ్యాఖ్యలు చేసిన రాం గోపాల్ వర్మ, మీకు డేంజరస్ హీరోలుంటే.. నాకు డేంజరస్ హీరోయిన్లున్నారంటూ ట్వీట్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana chief minister KCR) బయోపిక్‌ను త్వరలోనే తీస్తానని ప్రకటించారు.
వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తాజాగా మరో సంచలన ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana chief minister KCR) బయోపిక్‌ను త్వరలోనే తీస్తానని ప్రకటించారు. డేంజరస్ చిత్ర ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న ఆర్జీవీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలపై చర్చించారు. తనకు 'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం బాగా నచ్చిందని, త్వరలోనే కేసీఆర్ బయోపిక్ తీస్తానని వెల్లడించాడు.
ఇదిలా ఉంటే వర్మ.. తన లేటెస్ట్ మూవీ ‘డేంజరస్’ పబ్లిసిటీకి కూడా రాజమౌళిని, ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రాన్ని వాడేశాడు. డేంజరస్’ సినిమాలో నటించిన నైనా గంగూలి, అప్సరారాణి లతో తను దిగిన ఫోటోను. ‘ఆర్.ఆర్.ఆర్’ త్రయం రాజమౌళి, యన్టీఆర్, రామ్ చరణ్ ఫోటోను షేర్ చేస్తూ.. ‘బాగుంది సార్ రాజమౌళి సార్.. మీకు యన్టీఆర్, రామ్ చరణ్ లాంటి డేంజరస్ హీరోలుంటే.. నాకు నైనా గంగూలి, అప్సరా రాణి లాంటి డేంజరస్ హీరోయిన్లున్నారు’ అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)