RIP Abhishek Chatterjee: చిత్ర పరిశ్రమలో మరో విషాదం, ప్రముఖ నటుడు అభిషేక్ ఛటర్జీ గుండెపోటుతో కన్నుమూత, సంతాపం వ్యక్తం చేసిన సీఎం దీదీ

బెంగాలీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ బెంగాలీ నటుడు అభిషేక్ ఛటర్జీ నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.

RIP Abhishek Chatterjee (Photo Credits: Twitter)

బెంగాలీ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ బెంగాలీ నటుడు అభిషేక్ ఛటర్జీ నిన్న రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 58 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1985లో 'పాత్ భోలా' చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అభిషేక్ 100కు పైగా సినిమాల్లో నటించారు. అభిషేక్ మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. మరోవైపు బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అభిషేక్ ఛటర్జీ హఠాన్మరణం చెందారనే వార్త తనను కలచి వేసిందని అన్నారు ఆయన మరణం సినీ, టీవీ రంగాలకు తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now