RRR at Oscars 2023: వీడియో ఇదిగో.., స్టేజిపైన పాట పాడి ఎమోషన్ అయిన కీరవాణి, చిరకాల కోరిక తీరిందని భావోద్వేగంతో వెల్లడించిన మ్యూజిక్ డైరక్టర్
అందులో.. ‘నా మదిలో ఒకే ఒక కోరిక ఉండేది. అదే ఆర్‌ఆర్‌ఆర్ ఆస్కార్ కైవసం చేసుకోవాలని’ అన్నారు. ఈ సినిమా భారతీయులను గర్వపడేలా చేసిందన్నారు. ఆర్ఆర్ఆర్… తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని, థ్యాంక్యూ కార్తికేయ అని కీరవాణి పేర్కొన్నారు.
లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా ప్రపంచ వేదికపై ఓ తెలుగు సినిమా సత్తా చాటింది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను కైవసం చేసుకుని చరిత్రను తిరగరాసింది. ఆర్‌ఆర్‌ఆర్‌లోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో అవార్డ్‌ను సొంతం చేసుకుని చరిత్రను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్రానికి గుర్తింపును తెచ్చిపెట్టింది.
ఆస్కార్ అవార్డ్‌ను ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. అనంతరం ఆయన పాట రూపంలో తన ఆనందాన్ని వ్యక్త పరిచారు. అందులో.. ‘నా మదిలో ఒకే ఒక కోరిక ఉండేది. అదే ఆర్‌ఆర్‌ఆర్ ఆస్కార్ కైవసం చేసుకోవాలని’ అన్నారు. ఈ సినిమా భారతీయులను గర్వపడేలా చేసిందన్నారు. ఆర్ఆర్ఆర్… తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని, థ్యాంక్యూ కార్తికేయ అని కీరవాణి పేర్కొన్నారు. చివరిలో రచయిత చంద్రబోస్ నమస్తే అంటూ తెలుగులో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు.
Here's Video