Salman Khan Death Threat: ఏప్రిల్ 30న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను చంపేస్తాం, గుర్తు తెలియని వ్యక్తి పోలీసులకు కాల్, అలర్ట్ అయిన ముంబై పోలీసులు
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ముంబై పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఈనెల 30న సల్మాన్‌ను చంపేస్తానని బెదిరించాడు. రాకీ భాయ్‌గా తనను పరిచయం చేసుకున్న అతను తనది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ అని చెప్పాడని పోలీసులు తెలిపారు.
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ముంబై పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఈనెల 30న సల్మాన్‌ను చంపేస్తానని బెదిరించాడు. రాకీ భాయ్‌గా తనను పరిచయం చేసుకున్న అతను తనది రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ అని చెప్పాడని పోలీసులు తెలిపారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
సల్మాన్ ఖాన్‌కు హత్యా బెదిరింపులు రావడం ఇదేం మొదటిసారి కాదు. గత నెలలోనూ రెండుసార్లు సల్మాన్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ వచ్చాయి. 2018లో కృష్ణజింకలను వేటాడిన కేసు విచారణ ఎదుర్కొన్న సల్మాన్‌ను హత్య చేస్తానంటూ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కోర్టు ఆవరణలోనే బెదిరించిన సంగతి తెలిసిందే.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)