Samantha Ruth Prabhu: ఇక‌నైనా ఎద‌గండి గాయ్స్, నాగ చైతన్య ఫ్యాన్స్‌కు సమంత వార్నింగ్, మా మీద ఫోకస్ మాని మీ ప‌నిమీద, కుటుంబాల మీద శ్ర‌ద్ధ‌పెట్టండంటూ ట్వీట్

అమ్మాయిపై పుకార్లు వ‌స్తే నిజ‌మే.. అబ్బాయిపై పుకార్లు వ‌స్తే కావాల‌ని అమ్మాయే చేయించింది. ఇక‌నైనా ఎద‌గండి గాయ్స్.. త‌ప్పుడు ప్ర‌చారం చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. మేము మూవ్ఆన్‌ అయిపోయాం. మీరు కూడా మూవ్ఆన్‌ అవ్వండి.

Samantha Ruth Prabhu (Photo-Facebook)

నాగ‌చైత‌న్య‌, శోభితా ధూళిపాల‌ డేటింగ్‌లో ఉన్నారంటూ గ‌త రెండు రోజుల నుంచి వార్త‌లు వ‌స్తున్న సంగతి తెలిసిందే. ఈ రూమ‌ర్స్‌పై నాగ చైత‌న్య అభిమానులు స్పందిస్తూ.. చై ఇమేజ్ చెడ‌గొట్ట‌డానికి స‌మంత పీఆర్ టీం ఈ రూమ‌ర్స్‌ను సృష్టిస్తున్నార‌ని ట్వీట్స్ చేస్తున్నారని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్స్‌పై సామ్ స్పందిస్తూ.. ‘అమ్మాయిపై పుకార్లు వ‌స్తే నిజ‌మే.. అబ్బాయిపై పుకార్లు వ‌స్తే కావాల‌ని అమ్మాయే చేయించింది. ఇక‌నైనా ఎద‌గండి గాయ్స్.. త‌ప్పుడు ప్ర‌చారం చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. మేము మూవ్ఆన్‌ అయిపోయాం. మీరు కూడా మూవ్ఆన్‌ అవ్వండి. మీ ప‌నిమీద, కుటుంబాల మీద శ్ర‌ద్ధ‌పెట్టండి’ అంటూ స‌మంత ఆ మీడియా క‌థ‌నాన్ని ట్యాగ్ చేసింది. ప్ర‌స్తుతం ట్వీట్ నెట్టింట వైర‌ల్ అవుతుంది.

కాగా టాలీవుడ్ స్టార్ కపుల్ సమంత, నాగచైతన్య గతేడాది డిసెంబర్‌లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. చాలాకాలంపాటు ప్రేమించుకున్న వీరిద్దరు ఐదేళ్ళ వైవాహిక జీవితానికి శుభం కార్డు వేస్తూ విడాకులను ప్రకటించారు. ఈ విషయం అటు సమంత అభిమానులను ఇటు నాగచైతన్య అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇక ఈ జంట గురించి ఎక్కువ‌ వార్త‌లు వ‌చ్చిన క్ష‌ణాల్లో వైర‌ల్ అవుతున్నాయి.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now