Sanatana Dharma Row: సనాతన ధర్మం వ్యాఖ్యల దుమారం, ఉదయనిధికి మద్దతు ప్రకటించిన ప్రముఖ నటుడు సత్యరాజ్
ఉదయనిధి అన్న మాటల్లో తప్పేముందని సత్యరాజ్ అన్నారు. ఉదయనిధి నిర్భయంగా తన అభిప్రాయాలను పంచుకున్నారని, సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా ఉన్నాయని వివరించారు
తమిళనాడు మంత్రి, నటుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల పట్ల దేశ వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయనిధి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాల్సిందేనని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అదే సమయంలో కొందరు ఉదయనిధి వ్యాఖ్యలను సమర్థిస్తూ, ఆయనకు మద్దతిస్తున్నారు.
ప్రముఖ దక్షిణాది నటుడు సత్యరాజ్ కూడా తాను ఉదయనిధి వైపేనని స్పష్టం చేశారు. ఉదయనిధి అన్న మాటల్లో తప్పేముందని సత్యరాజ్ అన్నారు. ఉదయనిధి నిర్భయంగా తన అభిప్రాయాలను పంచుకున్నారని, సనాతన ధర్మంపై ఆయన చేసిన వ్యాఖ్యలు స్పష్టంగా ఉన్నాయని వివరించారు. ఇంత ధైర్యంగా తన అభిప్రాయాలు వెల్లడించినందుకు ఆయనను అభినందిస్తున్నానని సత్యరాజ్ తెలిపారు. ఓ మంత్రిగా ఉదయనిధి కార్యాచరణ, వ్యవహార శైలి పట్ల గర్విస్తున్నామని అన్నారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)