Sanchari Full Song: ప్రభాస్ రాధేశ్యామ్‌ నుంచి సంచారి పుల్ సాంగ్ ఇదే, చలో సంచారి! చల్ చలో చలో కొత్త నేలపై అంటూ దుమ్మురేపుతున్న సాంగ్, జనవరి 14న సంక్రాంతికి రాధే శ్యామ్‌ విడుదల

సంచారి అంటూ సాగే ఈ పాట టీజర్‌ను ఇటీవల మేకర్స్‌ విడుదల చేయగా ఇందులో ప్రభాస్‌ లుక్‌కు విశేష స్సందన వచ్చింది. తాజాగా సంచారి పూర్తి సాంగ్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ‘చలో… చలో… సంచారి! చల్ చలో… చలో! చలో… చలో… సంచారి! చల్ చలో… చలో… కొత్త నేలపై’ అనే లిరిక్స్‌తో సాగే వీడియో సాంగ్‌ని విడుద‌ల చేశారు.

Prabhas Radhe Shyam

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌-పూజ హెగ్డే హీరోహీరోయిన్‌గా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ‘రాధేశ్యామ్‌’. కె. రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించిన ఈచిత్రాన్ని వంశీ, ప్రమోద్‌, ప్రసీధలు సంయుక్తంగా నిర్మించారు. ఇటలీ నేపథ్యంగా సాగే పీరియాడికల్‌ ప్రేమ కథగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో ప్రభాస్‌ విక్రమాదిత్య పాత్ర పోషిస్తుండగా, పూజ హెగ్డే ప్రేరణగా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్‌, ఫస్ట్‌లుక్‌, పాటలు సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ చేశాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు పాటలు బయటకు రాగా తాజాగా 3వ పాటను విడుదల చేసింది చిత్ర యూనిట్‌.

సంచారి అంటూ సాగే ఈ పాట టీజర్‌ను ఇటీవల మేకర్స్‌ విడుదల చేయగా ఇందులో ప్రభాస్‌ లుక్‌కు విశేష స్సందన వచ్చింది. తాజాగా సంచారి పూర్తి సాంగ్‌ను రిలీజ్‌ చేసింది చిత్ర బృందం. ‘చలో… చలో… సంచారి! చల్ చలో… చలో! చలో… చలో… సంచారి! చల్ చలో… చలో… కొత్త నేలపై’ అనే లిరిక్స్‌తో సాగే వీడియో సాంగ్‌ని విడుద‌ల చేశారు. ఇందులో ప్ర‌భాస్ లుక్స్ ఆక‌ట్టుకుంటున్నాయి. విజువ‌ల్స్ చాలా గ్రాండియ‌ర్‌గా ఉన్నాయి. ఈ పాట విడుదలైన గంటలోనే యూట్యూబ్‌లో వన్ మిలియన్ వ్యూస్‌కు రీచ్ అవ్వడం విశేషం. అనిరుధ్‌ రవిచందర్‌ ఆలపించిన ఈ పాటకు కృష్ణకాంత్‌ సాహిత్యం అందించాడు. జస్టిన్‌ ప్రభాకరణ్‌ స్వరాలు సమకూర్చారు. జనవరి 14న సంక్రాంతికి రాధే శ్యామ్‌ ప్రేక్షకుల ముందుకు రానుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now