Actor Lakshman Dies: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ కన్నడ నటుడు లక్ష్మణ్, సంతాపం తెలిపిన శాండల్ వుడ్ ప్రముఖులు

చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు లక్ష్మణ్ అనారోగ్యంతో కన్నుమూశారు. శాండల్ వుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సీనియర్ నటుడు లక్ష్మణ్ వయసు 74 ఏళ్ళు. కాగా, ముదలపాళ్యలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారని తెలుస్తోంది.

Sandalwood veteran actor Lakshman (Photo-Twitter/Sandalwood)

చిత్ర పరిశ్రమలో మరో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కన్నడ నటుడు లక్ష్మణ్ అనారోగ్యంతో కన్నుమూశారు. శాండల్ వుడ్ వర్గాల సమాచారం ప్రకారం.. సీనియర్ నటుడు లక్ష్మణ్ వయసు 74 ఏళ్ళు. కాగా, ముదలపాళ్యలోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారని తెలుస్తోంది. వయసు మీదపడటంతో కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న లక్ష్మణ్.. వృద్ధాప్య ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే గుండెపోటు రావడంతో తిరిగిరాని లోకాలకు వెళ్లారు.

లక్ష్మణ్ 1980లో ‘ఉషా స్వయంవర’ కన్నడ నాటకంలో చిన్న పాత్ర ద్వారా నట ప్రస్థానం మొదలుపెట్టారు. హీరో అంబరీష్ చేసిన ‘అంతా’ సినిమాలో ఇన్స్పెక్టర్ కుల్వంత్ పాత్రతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఆయన రాజ్ కుమార్, విష్ణువర్ధన్, అంబరీష్, సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి దిగ్గజ నటుల సినిమాలలో ఎన్నో పేరు తెచ్చిన పాత్రలు పోషించారు.

Here's News Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now