Sonali Phogat Dies: గుండెపోటుతో కుప్పకూలిన ప్రముఖ నటి, . 2020లో బిగ్‌బాస్ షో కంటెస్టెంట్‌గా అలరించిన సోనాలి ఫోగట్ మరణంతో విషాదంలో చిత్ర పరిశ్రమ, బీజేపీ పార్టీలో యాక్టివ్‌గా సోనాలి
2020లో బిగ్‌బాస్ షో కంటెస్టెంట్‌గా అలరించిన ఆమె.. రాజకీయ వేత్తగా కంటే తానొక కళాకారిణిని అనే విషయంపైనే ఎక్కువ దృష్టిసారిస్తుంటారు. కేవలం గ్లామర్ పరంగానే కాదు.. హర్యాన్వి కల్చర్‌ను ప్రతిబింబించేలా ఉంటాయి ఆమె పోస్టులు.
బీజేపీ నేత, నటి సోనాలి ఫోగట్ గుండెపోటుతో మరణించారు. 2020లో బిగ్‌బాస్ షో కంటెస్టెంట్‌గా అలరించిన ఆమె.. రాజకీయ వేత్తగా కంటే తానొక కళాకారిణిని అనే విషయంపైనే ఎక్కువ దృష్టిసారిస్తుంటారు. కేవలం గ్లామర్ పరంగానే కాదు.. హర్యాన్వి కల్చర్‌ను ప్రతిబింబించేలా ఉంటాయి ఆమె పోస్టులు. తన చివరి పోస్టుల్లోనూ హిందీ పాటకు డ్యాన్స్ చేశారామె. అదే సమయంలో ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఫొటోను సైతం పింక్ టర్బన్‌తో ఉన్న ఫొటోతో మార్చేశారు.
తన సిబ్బందితో కలిసి గోవాకు వెళ్లిన ఆమె.. సోమవారం రాత్రి సమయంలో తనకు ఒంట్లో బాగోలేదని సిబ్బందితో చెప్పారు.అయితే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే గుండెపోటుతో మరణించారు. చివరిసారిగా ఆమె చేసిన సోషల్ మీడియా పోస్టులకు ‘ఓం శాంతి’ కామెంట్లతో నివాళి అర్పిస్తున్నారు అభిమానులు. చివరి పోస్టులోనూ ఆమె కల్చర్‌ను, కళను వీడలేదని చెప్తున్నారు. టీవీ షో, టిక్‌టాక్‌స్టార్‌గానే కాకుండా బీజేపీ నేతగానూ పేరు సంపాదించుకున్నారు సోనాలి ఫోగట్. ఈమె భర్త సంజయ్ ఫోగట్ 2016లో మరణించగా.. ఆమెకు ఒక కూతురు యశోధర ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)