Sonu Sood: సోనూ ప్రధాని కావాలి, సంచలన వ్యాఖ్యలు చేసిన బిగ్‌బాస్ 14 కంటెస్టెంట్ రాఖీ సావంత్, ప్రజలకు సేవ చేయడానికే ఇష్టపడతానని స్పష్టం చేసిన సోనూ సూద్
బిగ్‌బాస్ 14 కంటెస్టెంట్ రాఖీ సావంత్ సోనూసూద్‌ను ‘భవిష్యత్ ప్రధాని’గా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తాజాగా ఈ వ్యాఖ్యలపై సోనూ స్పందించాడు. మంగళవారం రోజు తన అపార్ట్‌మెంట్ ముందుకు వచ్చిన ఫొటోగ్రాఫర్లకు సోనూసూద్ సమ్మర్ డ్రింక్స్ అందించాడు.
ఈ క్రమంలో ఓ వ్యక్తి తనను దేశానికి ప్రధానిగా చూడాలనుకునే ప్రజల అభిప్రాయలపై స్పందించమని నటుడిని కోరాడు. అనంతరం సోనూ స్పందిస్తూ.. రాజీకీయాలపై ఆసక్తి లేదని సాధారణ వ్యక్తిగా ఉంటూ ప్రజలకు సేవ చేయడానికే ఇష్టపడతానని స్పష్టం చేశాడు.
‘నేను ఒక సామాన్య వ్యక్తిగా బాగానే ఉన్నాను. నా సోదరులు రాజకీయాల్లో ఉన్నారు. ఎన్నికలతో పోరాడటం ద్వారా నేను ఏం పొందుతాను? అది నా పని కాదు.’ అని బదులిచ్చాడు. కాగా సోనూను ప్రధాని కావాలని కోరుకుంటున్న వ్యక్తుల్లో రాఖీ సావంత్ ఒక్కరే కాదు. కొన్ని రోజుల క్రితం కమెడియన్ వీర్ దాస్ కూడా 2024లో సోనూ సూద్ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశాడు. ఈ ప్రచారానికి ట్విట్టర్‌లో వేలాది గొంతులు తోడయ్యాయి.
Here's Update
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)