RGV Spark OTT Stream: ఓటీటీ వ్యాపారంలోకి వర్మ, స్పార్క్ పేరుతో ఓటీటీ యాప్ త్వరలో రిలీజ్, మే 15వ తేదీన మొదటి సినిమాగా స్ట్రీమింగ్ కానున్న డీ-కంపెనీ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఓటీటీ బాట పట్టాడు. ఆయన సొంతంగా స్పార్క్ అనే పేరుతో ఓటీటీ యాప్‌ను నటి, నిర్మాత చార్మీతో కలిసి స్థాపిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అంతేగాక ఆయన దర్శకత్వంలో వహించిన ‘డీ-కంపెనీ’ మే 15వ తేదీన మొదటి సినిమాగా ఇందులో స్ట్రీమింగ్ కానుంది.
కాగా ఆర్జీవీ ప్రముఖ టీవీ హోస్ట్ స్వప్న, వ్యాపారవేత్త సాగర్ మచనూరు సహకారంతో ఓటీటీ ప్లాట్‌ఫాంలో స్పార్క్ యాప్‌ను ప్రారంభించాడు.ఈ నేపథ్యంలో దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి, ప్రభాస్, ప్రకాశ్ రాజ్, దగ్గుబాటి సురేశ్ బాబు, పూరి జగన్నాథ్, మంచు లక్ష్మీ, అడవి శేషు, బాలీవుడ్ హీరో రిషితేష్ దేశ్‌ముఖ్‌తో సహా పలువురు హీరో హీరోయిన్లు, నటీనటులు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
అయితే ఇప్పటికే తెలుగులో ఆహా పేరుతో నిర్మాత అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్‌ఫాంను స్థాపించిన సంగతి తెలిసిందే. త్వరలోనే దగ్గుబాటి, అక్కినేని ఫ్యామిలీ సైతం కొత్తగా ఓటీటీ సంస్థలను స్థాపించాలని సన్నాహాలు చేస్తునట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Here's Ram Gopal Varma Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)