Viral Video: స్టార్ హీరోయిన్ తాప్సీ ఎదురుగా ఉన్నా పట్టించుకోని స్విగ్గీ డెలివరీ బాయ్, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో ఇదిగో..
ముంబయిలోని ఓ సెలూన్ నుంచి స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను బయటకొచ్చింది. ఇంతలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ అనుకోకుండా అదే సమయంలో సెలూన్ లోపలికి వెళ్తూ కనిపించారు. అతనికి ఎదురుగా హీరోయిన్ తాప్సీ వస్తున్నప్పటికీ అసలు ఆమెను పట్టించుకోకుండా తన పనేంటో చూసుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్స్ జరుగు అంటూ గట్టిగా అరిచినా ఎవరినీ లెక్కచేయకుండా సైలెంట్‌గా లోపలికి వెళ్లిపోయాడు.
ముంబయిలోని ఓ సెలూన్ నుంచి స్టార్ హీరోయిన్ తాప్సీ పన్ను బయటకొచ్చింది. ఇంతలో ఓ ఫుడ్ డెలివరీ బాయ్ అనుకోకుండా అదే సమయంలో సెలూన్ లోపలికి వెళ్తూ కనిపించారు. అతనికి ఎదురుగా హీరోయిన్ తాప్సీ వస్తున్నప్పటికీ అసలు ఆమెను పట్టించుకోకుండా తన పనేంటో చూసుకుంటూ వెళ్లిపోయాడు. అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్స్ జరుగు అంటూ గట్టిగా అరిచినా ఎవరినీ లెక్కచేయకుండా సైలెంట్‌గా లోపలికి వెళ్లిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని స్విగ్గీకి ట్యాగ్ చేస్తూ ఓ నెటిజన్ ఈ డెలివరీ భాగస్వామి అతని అంకితభావానికి ప్రోత్సాహానికి అర్హుడు అంటూ రాసుకొచ్చారు. దీనికి స్విగ్గీ ఇది మా పనితనం అంటూ సమాధానం ఇచ్చింది. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ ప్రముఖ తెలుగు హీరోలు, సుమారు 15 విలువైన కార్లను సీజ్, వంద మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Here's Video