Junior Balaiah Dies: సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం, ప్రముఖ నటుడు జూనియర్ బాలయ్య మృతి, సంతాపం తెలిపిన పలువురు సినీ ప్రముఖులు
తమిళ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు టీఎస్ బాలయ్య తనయుడు జూనియర్ బాలయ్య(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు.
తమిళ చిత్రపరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు టీఎస్ బాలయ్య తనయుడు జూనియర్ బాలయ్య(70) కన్నుమూశారు. గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. జూనియర్ బాలయ్య మృతి పట్ల సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
జూనియర్ బాలయ్య అసలు పేరు రఘు బాలయ్య. జూనియర్ బాలయ్య మేల్నట్టు మరుమాల్ సినిమాతో వెండితెరకు నటుడిగా పరిచయమయ్యారు. త్యాగం, హబే మాయం, గంగై అమరన్, అమ్మ వండచు, రాసుకుట్టి వంటి చిత్రాల్లోనూ ముఖ్య పాత్రలో నటించారు. సత్తై మూవీతో బాగా క్లిక్ అయ్యారు. సుందరకాండం, తని ఒరువన్, పులి, నేర్ కొండ పార్వై వంటి చిత్రాల్లోనూ యాక్ట్ చేశారు. అప్పుడప్పుడూ బుల్లితెరపై ప్రసారమయ్యే షోలలోనూ పాల్గొని సందడి చేసేవారు. ఆయన చివరగా 2021లో వచ్చిన 'ఎన్నంగ సర్ ఉంగ సట్టం' సినిమాలో కనిపించారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)