Beast Movie: బీస్ట్ సినిమా నచ్చలేదని థియేటర్‌ని తగలబెట్టిన విజయ్ అభిమానులు, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో, మండిపడుతున్న నెటిజన్లు

బీస్ట్ సినిమా బాగోలేదని, సినిమాపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయని తమిళనాడు మధురైలో ఓ థియేటర్ స్క్రీన్ కి అభిమానులు నిప్పు అంటించారు. దీంతో ఒక్కసారిగా థియేటర్ లో ఆందోళన ఏర్పడింది. విజయ్ అభిమానులు థియేటర్ స్క్రీన్ కి నిప్పు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Beast Movie

తమిళ్ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన ‘బీస్ట్’ సినిమా ఇవాళ రిలీజ్ అయింది.  ఈ నేపథ్యంలో విజయ్ అభిమానులు తమిళనాడులో రాత్రి నుంచే థియేటర్ల వద్ద హంగామా చేశారు. సినిమాపై భారీ అంచనాలతో థియేటర్స్ కి వెళ్లారు. అయితే అభిమానులకి తమ హీరో అని సినిమా నచ్చినా ప్రేక్షకులకి మాత్రం ఈ సినిమా అంతగా నచ్చలేదు. మొదటి ఆట నుండే సినిమాపై నెగిటివ్ టాక్ వచ్చింది.

చాలా మంది విజయ్ అభిమానులు కూడా బీస్ట్ సినిమా నచ్చలేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సినిమాపై నెగిటివ్ టాక్ రావడంతో విజయ్ అభిమానులు అసహనం వ్యక్తం చేశారు. తాజాగా బీస్ట్ సినిమా బాగోలేదని, సినిమాపై మిశ్రమ స్పందనలు వస్తున్నాయని తమిళనాడు మధురైలో ఓ థియేటర్ స్క్రీన్ కి అభిమానులు నిప్పు అంటించారు. దీంతో ఒక్కసారిగా థియేటర్ లో ఆందోళన ఏర్పడింది. విజయ్ అభిమానులు థియేటర్ స్క్రీన్ కి నిప్పు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు సినిమా నచ్చకపోతే థియేటర్ కి నష్టం కలిగిస్తారా అంటూ విజయ్ అభిమానులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now