Unstoppable with NBK: అమ్మాయిలకు లైన్ వేయడం తప్పేంటయ్యా, బైకులు వేసుకుని వారి కోసమే వెళ్లే వాళ్లం, అన్‌స్టాపబుల్‌ ఎన్‌బీకే షోలో రవితేజతో బాలయ్య, యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతున్న ప్రోమో

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ షోలో తాజాగా మాస్‌ మహారాజ రవితేజ అతిథిగా విచ్చేశాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజవగా యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది.

Unstoppable with NBK (Photo-Aha/Video Grab)

నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్‌స్టాపబుల్‌ షోలో తాజాగా మాస్‌ మహారాజ రవితేజ అతిథిగా విచ్చేశాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజవగా యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. రవితేజ స్టేజీపైకి వచ్చీరావడంతోనే నీకూ నాకూ పెద్ద గొడవైందటగా అని బాలయ్య ప్రశ్నించగా పనీపాటా లేనివాళ్లు అలాంటి వార్తలు స్ప్రెడ్‌ చేస్తూనే ఉంటారని కౌంటర్‌ ఇచ్చాడు మాస్‌ హీరో. మొగల్రాజపురం అమ్మాయిలకు లైన్‌ వేస్తుండేవాడివట కదా' అని బాలయ్య కూపీ లాగేందుకు ప్రయత్నించగా దానికి సమాధానం ఇవ్వడానికి రవితేజ తెగ ఇబ్బందిపడ్డాడు .

దీంతో బాలయ్య ఓపెన్‌ అవుతూ.. 'తప్పేంటయ్యా.. మేమూ లైన్‌ వేసేవాళ్లం. రెడ్డి కాలేజీ దగ్గర చుట్టాలుండేవాళ్లు. వాళ్ల పేరు చెప్పుకుని కాలేజీ దగ్గరకు బైకులేసుకుని వెళ్లేవాళ్లం..' అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఎపిసోడ్‌లో రవితేజతో పాటు గోపీచంద్‌ మలినేని​ కూడా ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ.. తాను డైరెక్టర్‌ కాకముందు సమరసింహారెడ్డి సినిమా వల్ల ఓసారి అరెస్ట్‌ అయ్యానని చెప్పడంతో బాలయ్య ఖంగు తిన్నాడు. మరి వీరి సరదా సంభాషణను చూడాలంటే డిసెంబర్‌ 31 వరకు ఆగాల్సిందే!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement