O2 Movie Trailer Out: నయనతార O2 ట్రైలర్ విడుదల, ఐదారేళ్ల బాబుకి తల్లిగా నటించిన నయనతార
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం O2 ట్రైలర్ (O2 Movie Trailer Out) విడుదలయింది. సినిమాలో నయనతార ఓ ఐదారేళ్ల బాబుకి తల్లిగా నటించింది. ట్రైలర్‌ను గమనిస్తే.. నయనతార కొడుకు శ్వాసను పీల్చుకోవడానికి ఇబ్బంది పడే ఓ సమస్యతో బాధపడుతుంటాడు.
లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం O2 ట్రైలర్ (O2 Movie Trailer Out) విడుదలయింది. సినిమాలో నయనతార ఓ ఐదారేళ్ల బాబుకి తల్లిగా నటించింది. ట్రైలర్‌ను గమనిస్తే.. నయనతార కొడుకు శ్వాసను పీల్చుకోవడానికి ఇబ్బంది పడే ఓ సమస్యతో బాధపడుతుంటాడు. అతనికి చికిత్స చేయించడానికి ఆమె మరో రాష్ట్రానికి వెళుతుంటుంది. అప్పుడు వారు వెళుతున్న రోడ్డు రెండు చీలి బస్సు అందులో పడిపోతుంది. భూమిలో కూరుకుపోతారందరూ అప్పుడు వారేం చేస్తారు? ఎలా భయటపడతారనేదే కథాంశంగా చూపించారు. జూన్ 17న డైరెక్ట్‌గా డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney+Hot star) లో ఈ చిత్రం విడుదల కానుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై జి.ఎస్.విఘ్నేష్(G.S.Vignesh) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)