TNR Dies of COVID-19: ప్రముఖ జర్నలిస్టు, సినీ నటుడు టీఎన్ఆర్ కరోనాతో కన్నుమూత, టీఎన్ఆర్ మృతి పట్ల జర్నలిస్టులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి

ప్రముఖ యూట్యూబ్ యాంకర్, జర్నలిస్టు, సినీ నటుడు టీఎన్ఆర్ కరోనాతో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. కొన్ని రోజుల క్రితం ఆయన కరోనా బారిన పడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.

TNR Dies of COVID-19 (Photo-Twitter)

టీఎన్ఆర్ అసలు పేరు తుమ్మల నరసింహారెడ్డి. యూట్యూబ్ వేదికగా ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులను ఆయన ఇంటర్వ్యూ చేశారు. ముక్కుసూటిగా ఆయన సంధించే ప్రశ్నలకు అతిథులు కూడా ఆశ్చర్యపోయిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. టీఎన్ఆర్ మృతి పట్ల జర్నలిస్టులు, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా సంతాపాలను ప్రకటిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement