Madapur Drugs Case: మాదాపూర్ డ్రగ్స్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదు, ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చిన హీరో నవదీప్, పరారీలో ఉన్నట్లు వార్తలపై స్పందన ఇదిగో..
మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి తన పేరు బయటకు రావడంతో మీరో నవదీప్ ఎక్స్ వేదికగా స్పందించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించాడు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని ట్విట్టర్ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు.
మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించి తన పేరు బయటకు రావడంతో మీరో నవదీప్ ఎక్స్ వేదికగా స్పందించారు. మాదాపూర్ డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. తాను పరారీలో ఉన్నట్లు వస్తున్న వార్తలను ఖండించాడు. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని ట్విట్టర్ ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. కాగా మాదాపూర్ డ్రగ్స్ కేసుకు సంబంధించిన పలు కీలక విషయాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించిన సంగతి విదితమే.మాదాపూర్‌లో ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, నిందితుల ఫోన్లను సీజ్ చేసినట్లు వివరించారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ కేసుతో సంబంధం ఉన్న వారిలో పలువురు పరారయ్యారని తెలిపారు. ఫోన్లు స్విచ్చాఫ్ చేసి మరి ఫ్యామిలీలతో సహా మాయమయ్యారని తెలిపారు. వారిలో గచ్చిబౌలిలో స్నాట్ పబ్ నిర్వహించే సూర్య, జూబ్లీహిల్స్‌లోని టెర్రా కెఫే అండ్ బిస్ట్రో బార్ నిర్వాహకుడు అర్జున్, షాడో సినిమా నిర్మాత రవి ఉప్పులపాటి, కల్హర్ రెడ్డి, ఇంద్రతేజ్, నవదీప్, శ్వేత, కార్తిక్ పరారీలో ఉన్నారని వివరించారు. వాళ్లందరినీ తొందరలోనే పట్టుకుంటామని సీపీ సీవీ అనంద్ వెల్లడించారు.
Here's Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)