Sudheer babu in Burka: సినిమా చూసేందుకు బుర్ఖాలో థియేటర్‌కు వెళ్లిన టాలీవుడ్ హీరో సుధీర్ బాబు.. ప్రేక్షకుల స్పందన ఏంటి? వీడియో ఇదిగో..
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు తన లేటేస్ట్ మామా మశ్చీంద్రాకు ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకునేందుకు బుర్ఖాలో థియేటర్‌కు వెళ్ళారు.
Hyderabad, Oct 7: టాలీవుడ్ హీరో (Tollywood Hero) సుధీర్ బాబు (Sudheer Babu) తన లేటేస్ట్ మామా మశ్చీంద్రాకు (Mama Mascheendra) ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉందో తెలుసుకునేందుకు బుర్ఖాలో థియేటర్‌కు వెళ్ళారు. తొలుత హీరోను పోల్చుకోని ఆడియన్స్.. ఆ తర్వాత ఎట్టకేలకు గుర్తుపట్టారు. సంబురంగా అరిచారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక మామా మశ్చీంద్ర విషయానికొస్తే.. ఇందులో ట్రిపుల్ రోల్ లో కనిపించారు సుధీర్ బాబు. ఇప్పటివరకు కమెడియన్ గానే మనకు తెలిసిన హర్షవర్ధన్ ఈ కు దర్శకత్వం వహించడం విశేషం. ఈషా రెబ్బా, మృణాళిని రవి హీరోయిన్లుగా నటించారు. రాజీవ్ కనకాల, అభినయ, అజయ్ కీలకపాత్రలు పోషించారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)