Comedians Viral Photo: తెలుగు సినీ కమెడియన్స్‌ కొత్త గ్రూపు, ఫ్లయింగ్ కలర్స్ గ్రూపు ద్వారా నెలకు ఓ సారి పార్టీ పెట్టుకుంటున్న టాలీవుడ్ హస్యనటులు, సోషల్ మీడియాలో ఫొటో వైరల్

ఈ వైరల్ ఫోటో సారాంశం ఏంటంటే.. వేణు, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిషోర్‌, ధన్‌రాజ్‌, రాజేశ్‌తో పాటు పలువురు కమెడియన్స్‌ కొన్ని రోజుల క్రితం కొంతమంది కలిసి ఫ్లయింగ్ కలర్స్ అనే ఓ గ్రూప్‌ను పెట్టుకున్నారు. ఈ గ్రూప్ వాళ్ళు ప్రతి నెల ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూ సరదాగా పార్టీ చేసుకుంటారు. ప్రతి సారి ఏదో ఒక థీమ్‌తో పార్టీ చేసుకుంటారు.

Comedians Viral Photo( Image Credit-Yours Dhanraj Instagram)

వేణు(టిల్లు), సప్తగిరి, శ్రీనివాస్‌ రెడ్డి, చిత్రం శ్రీను, వెన్నెల కిషోర్‌ పలువురు కమెడియన్స్‌ అందరూ ఒకే చోట దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వైరల్ ఫోటో సారాంశం ఏంటంటే.. వేణు, శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిషోర్‌, ధన్‌రాజ్‌, రాజేశ్‌తో పాటు పలువురు కమెడియన్స్‌ కొన్ని రోజుల క్రితం కొంతమంది కలిసి ఫ్లయింగ్ కలర్స్ అనే ఓ గ్రూప్‌ను పెట్టుకున్నారు. ఈ గ్రూప్ వాళ్ళు ప్రతి నెల ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూ సరదాగా పార్టీ చేసుకుంటారు. ప్రతి సారి ఏదో ఒక థీమ్‌తో పార్టీ చేసుకుంటారు.

తాజాగా సండే వీకెండ్‌ సందర్భంగా ఈ గ్రూప్ మెంబర్స్ మళ్ళీ కలుసుకుని పార్టీ చేసుకున్నారు. ఈ పార్టీలో అందరూ బ్లూ కలర్‌ డెనిమ్‌ షర్ట్‌, ప్యాంటుతో మెరిపించారు. ఈ నేపథ్యంలో కమెడియన్‌ వేణు(టిల్లు) వారందరి గ్రూప్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ షేర్‌ చేస్తూ నిన్న మా కలర్స్‌తో హ్యాపీ సండే అంటూ రాసుకొచ్చాడు. అలాగే ధన్‌రాజ్‌ కూడా ఈ ఫొటోను షేర్‌ చేస్తూ ‘స్వీట్ అండ్ క్యూట్ పార్టీ. హోస్టింగ్ చేసింది వెన్నెల కిషోర్, కమెడియన్ సత్య. లవ్ యూ’ అంటూ షేర్ చేశాడు.

 

View this post on Instagram

 

A post shared by Dhanraj (@yoursdhanraj)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now