Tollywood Drugs Case: వీడియో ఇదిగో, డ్రగ్స్ కేసులో ఈడీ విచారణకు హాజరైన హీరో నవదీప్, 29వ నిందితుడిగా అతని పేరును చేర్చిన పోలీసులు

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌ హీరో నవదీప్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 2017లోని డ్రగ్స్‌ కేసుకు సంబంధించి నవదీప్‌ను ఈడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. అయినా నవదీప్‌ నుంచి సరైన వివరాలు అందకపోవడంతో మరోసారి ఈడీ ఎదుట కావాలని నోటీసులు ఇచ్చారు.

Hero Navdeep attended the trial in the drug case

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్‌ హీరో నవదీప్‌కు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. 2017లోని డ్రగ్స్‌ కేసుకు సంబంధించి నవదీప్‌ను ఈడీ అధికారులు ఇప్పటికే పలుమార్లు విచారించారు. అయినా నవదీప్‌ నుంచి సరైన వివరాలు అందకపోవడంతో మరోసారి ఈడీ ఎదుట కావాలని నోటీసులు ఇచ్చారు. దీంతో వారి ముందు ఆయన నేడు హాజరయ్యారు. దీంతో నవదీప్‌ను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఈ కేసులో 29వ నిందితుడిగా అతని పేరు చేర్చినట్లు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే ముగ్గురు నైజీరియన్‌లతో సహా 8 మంది నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. వారిలో ముగ్గురు నైజీరియన్లతో హీరో నవదీప్‌కు ఉన్న పరిచయాలపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. వీరితో జరిపిన బ్యాంకు లావాదేవీల వివరాల గురించి ప్రశ్నిస్తున్నారు.

మాదాపూర్ డ్రగ్స్ కేసు వివరాలు ఇవ్వాలంటూ ఇప్పటికే నార్కోటిక్ పోలీసులను కోరిన ఈడి.. డ్రగ్ పెడ్లర్లు, బ్యాంకు లావాదేవీలతో నవదీప్‌కు ఉన్న సంబంధాలపై కూపీ లాగుతున్నారు. డ్రగ్స్ విక్రయాల ద్వారా మనీ లాండరింగ్ జరిగిందని కోణంలో ఈడి దర్యాప్తు కొనసాగుతుంది. నవదీప్‌ విచారణలో నోరువిప్పుతే మరికొందరి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Bandi Sanjay: ఎవడైనా హిందీ పేపర్ లీక్ చేస్తాడా..?..గ్రూప్-1 పేపర్ లీకేజీ కేసుతో నా ఇజ్జత్ పోయిందన్న కేంద్రమంత్రి బండి సంజయ్, వైరల్‌గా మారిన వీడియో

Vizag Astrologer Murder Case: విశాఖపట్నం జ్యోతిష్యుడు హత్య కేసులో షాకింగ్ విషయాలు, పూజలు చేస్తానంటూ ఇంటికి వెళ్లి మహిళపై అత్యాచారం, అందుకే దారుణంగా హత్య చేసిన భార్యాభర్తలు

Bhupalapally Murder Case: భూవివాదం నేపథ్యంలోనే రాజలింగమూర్తి హత్య అన్న బీఆర్ఎస్..సీబీసీఐడీతో విచారిస్తామ్న మంత్రి కోమటిరెడ్డి, భూపాలపల్లి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మాటల యుద్ధం

Brutual Murder at Bhupalapally: మేడిగడ్డ కుంగుబాటు.. కేసీఆర్‌పై కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య, భూపాలపల్లిలో లింగమూర్తిని దారుణంగా చంపేసిన దుండగులు, కేటీఆర్ ఆదేశాలతోనే హత్య జరిగిందని మృతుడి భార్య ఆవేదన

Share Now