Mahesh Koneru Passed Away: గుండెపోటుతో తెలుగు సినీ నిర్మాత మహేశ్ కోనేరు మృతి, సంతాపం వ్యక్తం చేసిన సినీ ప్రముఖులు, ఆత్మీయుడిని కోల్పోయానంటూ ఎన్టీఆర్ ట్వీట్

తెలుగు సినీ నిర్మాత మహేశ్ కోనేరు హఠాన్మరణం చెందారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. '123 తెలుగు' అనే న్యూస్ సైట్ లో రివ్యూయర్, జర్నలిస్టుగా ఆయన తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ‘కంచె’ సినిమాతో ప్రచారకర్త, మార్కెటింగ్ వ్యూహకర్తగా మారారు.

RIP

తెలుగు సినీ నిర్మాత మహేశ్ కోనేరు హఠాన్మరణం చెందారు. ఇవాళ ఉదయం గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. '123 తెలుగు' అనే న్యూస్ సైట్ లో రివ్యూయర్, జర్నలిస్టుగా ఆయన తన కెరీర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ‘కంచె’ సినిమాతో ప్రచారకర్త, మార్కెటింగ్ వ్యూహకర్తగా మారారు. ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వద్ద వ్యక్తిగత సహాయకుడిగా, పీఆర్ఓగా ఆయన పనిచేశారు.సొంతంగా ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ అనే సంస్థను ఏర్పాటు చేసి పలు సినిమాలను నిర్మించారు.

118, తిమ్మరుసు, మిస్ ఇండియా వంటి చిత్రాలను తీశారు. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన బాహుబలి రెండు భాగాలకూ పబ్లిసిటీ, మార్కెటింగ్ టీంలో కీలకంగా వ్యవహరించారు. ‘118’ సినిమాతో నిర్మాతగా మారారు. కాగా, ఆయన మరణవార్త విని పలువురు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మహేశ్ చనిపోయాడంటే నమ్మలేకపోతున్నానని జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన చిరకాల మిత్రుడు మహేశ్ మన మధ్య లేడనే విషయాన్ని భారమైన హృదయంతో అందరికీ తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement