Chiranjeevi: అభిమాని చివరి కోరికను నెరవేర్చిన చిరంజీవి, రెండు కిడ్నీలు పాడైన నాగరాజును ఇంటికి ఆహ్వానించి అక్కున చేర్చుకున్న మెగాస్టార్

మెగాస్టార్‌ చిరంజీవి తన అభిమాని కోరికను నెరవేర్చాడు. మొగల్తూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మెగాస్టార్‌కు వీరాభిమాని. రెండు కిడ్నీలు పాడైన ఈయన చివరిసారిగా చిరంజీవిని చూడాలని ఉందని మనసులోని కోరిక బయటపెట్టాడు. ఈ విషయం కాస్తా ఆయన దాకా చేరింది.

Megastar Chiranjeevi fulfils his fan's last wish

మెగాస్టార్‌ చిరంజీవి తన అభిమాని కోరికను నెరవేర్చాడు. మొగల్తూరుకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మెగాస్టార్‌కు వీరాభిమాని. రెండు కిడ్నీలు పాడైన ఈయన చివరిసారిగా చిరంజీవిని చూడాలని ఉందని మనసులోని కోరిక బయటపెట్టాడు. ఈ విషయం కాస్తా ఆయన దాకా చేరింది.వెంటనే తన అభిమాని కుటుంబాన్ని ఇంటికి ఆహ్వానించాడు. మృత్యువుతో పోరాడుతున్న నాగరాజును చూసి చలించిపోయిన చిరు ఆయన్ను ఆప్యాయంగా హత్తుకున్నాడు. కాసేపు అభిమానితో మాట్లాడి ఆయనకు మానసిక స్థైర్యాన్ని అందించాడు. అంతేకాక ఆర్థిక సహాయం కూడా కల్పించాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవగా చిరు మంచి మనసును మెచ్చుకోకుండా ఉండలేపోతున్నారు నెటిజన్లు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now