Mahesh Babu: ఒక్కరోజులోనే 30 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడిన మహేశ్, ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మరో అద్భుతమైన కార్యానికి శ్రీకారం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఒక్కరోజులోనే 30 మంది చిన్నారుల ప్రాణాలను కాపాడారు. ఇప్పటికే వేల ప్రాణాలను తన సొంత డబ్బుతో చిన్నారులకు గుండే ఆపరేషన్ చేయించి కాపాడిన మహేష్ ..తన పేరు మీద ప్రారంభించిన ఫౌండేషన్ ద్వారా తన సహాయా సహకారాలను మరింతగా విస్తరింపజేశారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరో అద్భుతమైన కార్యానికి ఆయన శ్రీకారం చుట్టారు.

ఈ ప్రత్యేకమైన రోజున ఏకంగా 30 మంది చిన్నారుల గుండెలకి ఊపిరి పోసి వారి కుటుంబాలలో కొత్త వెలుగులు నింపారు. తాజాగా ఈ విషయాన్ని మహేష్ సతీమణి నమ్రత సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ గవర్నర్‌కు అలాగే, ఆంధ్ర రాష్ట్ర ఆసుపత్రి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ నేపథ్యంలో మహేష్ అభిమానులు మారోసారి తమ అభిమాన హీరో చేసిన ఈ గొప్ప కార్యం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. నమ్రత పెట్టిన ఈ పోస్టును సోషల్ మీడియాలో పంచుతూ వైరల్ చేస్తున్నారు.

View this post on Instagram

A post shared by Namrata Shirodkar (@namratashirodkar)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement