Actress Chandrika Saha's Husband Booked: తన కొడుకును కొట్టి చంపాడంటూ భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రముఖ నటి చంద్రిక సాహా
తన కొడుకును భర్తే స్వయంగా మూడుసార్లు నేలకేసి కొట్టాడంటూ వీడియోని పోలీసులకు అందించింది. ఈ వీడియో ఆధారంగా నటి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
అదాలత్, సీఐడీ, సావధాన్ ఇండియా: క్రైమ్ అలర్ట్ వంటి పలు సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచ్చుకున్న నటి చంద్రిక సాహా తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తంలో ఒకరిని పెళ్లాడి విడాకులిచ్చిన ఆమెకు 2020లో వ్యాపారవేత్త అమన్ మిశ్రను చేసుకున్న సంగతి విదితమే. వీరికి 14 నెలల బాబు ఉన్నాడు. అయితే బాబును ఆడించమన్నందుకు భర్త అమన్ మిశ్రా నేలకేసి కొట్టి చంపేశాడు. సీసీటీవీ పరిశీలించగా భర్త చేసిన దారుణం కళ్లారా చూసి నటి ఒక్కసారిగా ఖంగుతింది. తన కొడుకును భర్తే స్వయంగా మూడుసార్లు నేలకేసి కొట్టాడంటూ వీడియోని పోలీసులకు అందించింది. ఈ వీడియో ఆధారంగా నటి తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)