Ustad Bhagat Singh: ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మొదటి షెడ్యూల్‌ను శరవేగంగా పూర్తిచేసిన పవన్‌ కల్యాణ్‌.. హ్యాపీ మూడ్ లో చిత్రబృందం

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ కొత్త సినిమా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మొదటి షెడ్యూల్‌ శరవేగంగా పూర్తయింది. హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభమైన ఈ చిత్ర తొలి షెడ్యూల్‌లో ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌ కంపోజిషన్‌లో వెయ్యిమందికి పైగా జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొనగా స్టంట్స్‌ రూపొందించారు.

Ustad Bhagat Singh (Credits: Twitter)

Hyderabad, April 16: పవర్ స్టార్ పవన్ కళ్యాన్ (Powerstar Pavan Kalyan) కొత్త సినిమా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ (Ustad Bhagat Singh) మొదటి షెడ్యూల్‌ శరవేగంగా పూర్తయింది. హైదరాబాద్‌లో ఇటీవల ప్రారంభమైన ఈ చిత్ర తొలి షెడ్యూల్‌లో (First Schedule) ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌ కంపోజిషన్‌లో వెయ్యిమందికి పైగా జూనియర్‌ ఆర్టిస్టులు పాల్గొనగా స్టంట్స్‌ రూపొందించారు. అలాగే భారీ పోలీస్‌స్టేషన్‌ సెట్‌లో కొన్ని కీలక సన్నివేశాలు, నర్రా శ్రీను, చమ్మక్‌ చంద్ర, పిల్లలతో మరికొన్ని కామెడీ సీన్స్‌ చేశారు. ఈ షెడ్యూల్‌లో తెరకెక్కించిన ఫుటేజ్‌ పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు చిత్రబృందం తెలిపింది. పవన్‌ క్యారెక్టర్‌కు స్పెషల్‌ మేనరిజమ్స్‌తో పాటు ఆకట్టుకునేలా డైలాగ్స్‌ ఉంటాయని దర్శకుడు హరీశ్‌ చెబుతున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల నాయికగా నటిస్తున్నది. హరీశ్‌ శంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌ నిర్మిస్తున్నారు.

Ustad Bhagat Singh (Credits: Twitter)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now