
Vijayawada, Mar 1: తెలుగు రాష్ట్రాల (Telugu States) మంత్రుల కాన్వాయ్ లకు ఇటీవల ప్రమాదాలు (Dy CM Pawan Kalyan Convoy Accident) పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ ఢీకొన్న ఘటనలో ముగ్గురు గాయపడిన ఘటన మరువకముందే అలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఢీకొని ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. ఏపీలోని తాడేపల్లిలోని డీజీపీ ఆఫీస్ వద్ద శుక్రవారం రాత్రి ఈ ఘటన జరిగింది. గాయపడిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ సిబ్బంది వెంటనే ఎన్నారై హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. క్షతగాత్రుడు రాధా రంగా నగర్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రమాద విషయం తెలుసుకోగానే పవన్ టీం బాధితుడికి తగిన సహాయం అందించినట్టు సమాచారం.
Here's Video:
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఢీకొని వ్యక్తికి ప్రమాదం
తాడేపల్లిలోని డీజీపీ ఆఫీస్ వద్ద ఘటన
ఎన్నారై హాస్పిటల్‌కు తరలించిన పవన్ కళ్యాణ్ సిబ్బంది
రాధా రంగా నగర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తింపు pic.twitter.com/fnjLhHoGJu
— Telugu Scribe (@TeluguScribe) March 1, 2025
శ్రీధర్ బాబు కాన్వాయ్ ప్రమాదం ఇలా..
తెలంగాణ రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కాన్వాయ్ లోని పైలెట్ వాహనం ప్రమాదానికి గురైంది. కాన్వాయ్ లోని పైలట్ వాహనం ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో 8 ఏళ్ల బాలుడికి రెండు కాళ్లు విరగగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను మార్కుక్ మండలం పాతూరు గ్రామానికి చెందిన చందా కనకయ్య, మన్నె బాలరాజు, అతని కొడుకు భాను ప్రసాద్ (8) గా గుర్తించారు. కాగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారం గ్రామ శివారులో ఇటీవల ఈ ప్రమాదం జరుగడం తెలిసిందే.