Director Sagar Dies: ప్రముఖ దర్శకుడు సాగర్ కన్నుమూత, అనారోగ్యంతో చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తిరిగిరాని లోకాలకు..

ప్రముఖ సీనియర్‌ దర్శకుడు సాగర్‌(విద్యాసాగర్‌ రెడ్డి) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి ఈ ఉదయం గం. 6.03ని.లకు తుదిశ్వాస విడిచారు.

RIP

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్‌ దర్శకుడు సాగర్‌(విద్యాసాగర్‌ రెడ్డి) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి ఈ ఉదయం గం. 6.03ని.లకు తుదిశ్వాస విడిచారు.

1983లో నరేష్-విజయశాంతిల ‘రాకాసిలోయ’సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన నటశేఖర కృష్ణతో తీసిన ‘అమ్మదొంగా’ చిత్రం మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. భానుచందర్, లిజీలతో ‘స్టూవర్ట్‌పురం దొంగలు, ఓసినా మరదలా, ఖైదీ బ్రదర్స్‌, యాక్షన్‌ నెంబర్‌ 1 సహా సుమారు 40 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన తెరకెక్కించిన 'రామసక్కనోడు' చిత్రానికి మూడు నంది పురస్కారాలు లభించాయి.వి.వి.వినాయక్ , శ్రీనువైట్ల, రవికుమార్ చౌదరి లాంటి ఎందరో దర్శకులు ఈయన శిష్యులే.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif