Vijayashanthi in Kalyanram Movie: మరో సినిమాకు విజయశాంతి గ్రీన్ సిగ్నల్.. నందమూరి కల్యాణ్ రామ్ సినిమాలో కీలక పాత్రకు ఓకే
రాజకీయాలు, ప్రజాసేవా కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్న ‘లేడీ అమితాబ్’ విజయశాంతి చాలా గ్యాప్ తర్వాత మరోసారి వెండితెరపై మెరవబోతున్నారు.
Hyderabad, Oct 21: రాజకీయాలు, ప్రజాసేవా కార్యక్రమాల్లో బిజీబిజీగా గడుపుతున్న ‘లేడీ అమితాబ్’ విజయశాంతి (Vijayashanthi) చాలా గ్యాప్ తర్వాత మరోసారి వెండితెరపై మెరవబోతున్నారు. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే మళ్లీ సినిమాలు చేయబోనని ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ప్రమోషన్స్ సమయంలో చెప్పిన రాములమ్మ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అందుకు తగ్గట్టే కొన్ని అవకాశాలు వచ్చినా ఆమె తిరస్కరిస్తూ వచ్చారు. అయితే తాజాగా నందమూరి కల్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమాకు ఆమె ఓకే చెప్పినట్టు నిర్ధారణ అయ్యింది. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించి హైదరాబాద్‌లో నిర్వహించిన పూజా కార్యక్రమాల ద్వారా క్లారిటీ వచ్చింది. పూజా కార్యక్రమాలకు విజయశాంతి కూడా హాజరయ్యారు. కాగా.. స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో విజయశాంతి రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.