Kangana Ranaut Slapping Case: కంగనాను చెంపదెబ్బ కొట్టిన మహిళకు బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ బంపరాఫర్, యువతికి మద్దతుగా నిలుస్తూ..
బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ ఆ యువతికి అతడు మద్దతుగా నిలిచాడు. కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన కుల్విందర్ కౌర్‌కు తాను ఉద్యోగం కల్పిస్తానని సింగర్ విశాల్ దద్లానీ హామీ ఇచ్చాడు.
చంఢీఘడ్ విమానాశ్రయంలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్‌పై సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ దాడి చేసిన సంగతి విదితమే. కంగనా ఎంపీగా గెలవడంతో చెంపదెబ్బ కొట్టిన మహిళా ఉద్యోగిని ఇప్పటికే సస్పెండ్ చేశారు. అయితే రైతుల ధర్నాను ఉద్దేశించి కంగనా గతంలో కామెంట్స్ చేసినందుకే తాను కొట్టినట్లు సీఐఎస్‌ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ వెల్లడించింది. ఈ ఘటనపై అధికారులు మహిళా కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేయడంతో పాటు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రూ. 100 కే అంటూ రైతుల నిరసనను అవమానించినందుకే చెంప పగలగొట్టా, కంగనాను చెంప దెబ్బ కొట్టిన మహిళా కానిస్టేబుల్ స్పందన ఇదే..
తాజాగా బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ దద్లానీ ఆ యువతికి అతడు మద్దతుగా నిలిచాడు. కంగనా రనౌత్‌ను చెంపదెబ్బ కొట్టిన కుల్విందర్ కౌర్‌కు తాను ఉద్యోగం కల్పిస్తానని సింగర్ విశాల్ దద్లానీ హామీ ఇచ్చాడు. ఆమె ఒప్పుకుంటే తగిన ఉద్యోగం ఇస్తానని చెప్పారు. ఈ మేరకు తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. జై హింద్. జై జవాన్. జై కిసాన్ అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చారు.తాను హింసకు ఎప్పుడూ మద్దతు ఇవ్వను.. కానీ ఆమె కోపాన్ని నేను కచ్చితంగా అర్థం చేసుకున్నానని తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)