Gaami Trailer Out: గూస్ బంప్స్ తెప్పిస్తున్న విశ్వక్ సేన్‌ గామి ట్రైలర్, మరో రెండు రోజుల్లో అనుకున్న కార్యం చేయలేకపోతే మరో 36 ఏళ్లు నిరీక్షించాల్సిందే అంటూ..

Vishwak Sen’s ‘Gaami’ trailer a visual treat; out now Watch Video

టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్‌ (Vishwak Sen) గామిట్రైలర్ విడుదలైంది. విద్యాధర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అడ్వెంచరస్‌ ఫాంటసీ ఫిల్మ్‌గా రాబోతోంది. ఈ చిత్రంలో విశ్వక్‌ సేన్‌ అఘోరాగా కనిపించబోతుండగా.. చాందినీ చౌదరి ఫీ మేల్ లీడ్‌ రోల్‌ పోషిస్తోంది. తాజాగా మేకర్స్‌ గామి ట్రైలర్‌ను లాంఛ్ చేశారు.నేనెవరో.. అసలు ఎక్కడినుంచి వచ్చానో.. నాకీ సమస్య ఎప్పటి నుంచి ఉందో.. ఎంత ప్రయత్నించినా గుర్తు రావట్లేదు.. అంటూ విశ్వక్‌సేన్ వాయిస్‌ ఓవర్‌ ట్రైలర్ అమాంతం హైప్ క్రియేట్ చేస్తోంది. మరో రెండు రోజుల్లో అనుకున్న కార్యం చేయలేకపోతే మరో 36 ఏళ్లు నిరీక్షించాల్సిందే అనే డైలాగ్‌ సనిమాకు మూలం కానుంది.

ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ ట్రైలర్‌ సుమారు మూడు నిమిషాలకు పైగానే ఉంది. క్రౌడ్‌ ఫండింగ్‌లో భాగంగా చేసిన ఈ సినిమాకు కార్తీక్‌ శబరీష్‌ నిర్మాత‌గా ఉన్నారు. మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో అద్భుతమైన గ్రాఫిక్స్‌ ఉన్నాయి.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)