Junior NTR in Bengaluru: జూనియర్ ఎన్టీఆర్ వీడియో వైరల్, కుర్చీని తుడిచి ఇన్ఫోసిస్ ఛైర్మన్ సుధామూర్తిని కుర్చీలో కూర్చోబెట్టిన జూనియర్, కన్నడ రాజ్యోత్సవ వేడుకలో సన్నివేశం

ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.

Junior NTR (Photo-Video Grab)

నవంబర్ ఒకటో తేదీన ఆ రాష్ట్ర అసెంబ్లీలో నిర్వహించిన కన్నడ రాజ్యోత్సవ వేడుకలో యంగ్ టైగర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజినీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో ఓ అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది.ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్‌తో పాటు ఇన్ఫోసిస్ ఛైర్మన్ సుధామూర్తి కూడా హాజరయ్యారు. వేదికపై ఉ‍న్న కూర్చీల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ను కూర్చోమని నిర్వాహకులు కోరారు. కానీ ఎన్టీఆర్ అక్కడే ఉన్న మరో మహిళతో పాటు సుధామూర్తిని తానే స్వయంగా కూర్చీలను తుడిచి వారిని కూర్చోబెట్టారు. ఆ వీడియోను తీసిన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)