Rajinikanth's House in Floods: వరదల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ ఇల్లు ఎలా మునిగిపోయిందో వీడియోలో చూడండి, ఇంటి బయట భారీగా వరద నీరు
ప్రముఖ స్టార్ నటుడు రజినీకాంత్ (Rajinikanth) ఇంటిని కూడా వరద నీరు చుట్టుముట్టింది.. చెన్నైలోని పోయెస్ గార్డెన్ (Poes Garden) ప్రాంతంలో ఉన్న రజినీ ఇంటి బయట భారీగా వరద నీరు నిలిచిపోయింది. నీటి ఎద్దడి కారణంగా ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.
మిగ్‌జాం తుఫాన్ (Cyclone Michaung) దెబ్బకు తమిళనాడు రాజధాని చెన్నై (Chennai) అతలాకుతలమైంది. భీకర గాలులు, కుండపోత వానతో చెన్నైలోని అనేక ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. నగరంలో కురిసిన భారీ వర్షాల ధాటికి జనజీవనం అస్తవ్యస్తమైంది.తాజాగా ఐఎండీ మరో 5 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని అలర్ట్ జారీ చేసింది. కాగా ప్రముఖ స్టార్ నటుడు రజినీకాంత్ (Rajinikanth) ఇంటిని కూడా వరద నీరు చుట్టుముట్టింది.. చెన్నైలోని పోయెస్ గార్డెన్ (Poes Garden) ప్రాంతంలో ఉన్న రజినీ ఇంటి బయట భారీగా వరద నీరు నిలిచిపోయింది. నీటి ఎద్దడి కారణంగా ఆ ప్రాంతంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రజినీకాంత్ ఇంటి వద్ద వరదనీటికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)