Jabardasth Punch Prasad Health: జబర్దస్త్ కమెడియన్‌కి అండగా ఏపీ ప్రభుత్వం, పంచ్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో టచ్‌లో ఉన్నామని తెలిపిన ఏపీ సీఎంఓ
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన డయాలసిస్ చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని జబర్దస్త్ కమెడియన్ నూకరాజు సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తాజాగా ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి కార్యక్రమాలన్నీ పర్యవేక్షించే డాక్టర్ మామిడి హరికృష్ణకు ఒక నెటిజన్ ట్యాగ్ చేశారు. దీంతో ఈ విషయంపై సీఎం ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ హరికృష్ణ స్పందించారు.
ఇప్పటికే తమ టీం పంచ్ ప్రసాద్ కుటుంబసభ్యులతో టచ్‌లో ఉందని వెల్లడించారు. వారితో లెటర్ ఆఫ్ క్రెడిట్ అప్లై చేసేందుకు ప్రయత్నాలు చేసేందుకు కృషి చేస్తున్నామని ట్వీట్ చేశారు. డాక్యుమెంట్లను పరిశీలించి వీలైనంత త్వరగా క్లియర్ చేసే ప్రక్రియ మొదలవుతుందని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. దీంతో మంచి ప్రసాద్‌కి త్వరలోనే సర్జరీ జరిగి ఆయన ఆరోగ్యం కుదుటపడాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.
Here's News
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)