Bigg Boss Telugu 6: బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే విన్నర్ గా నిలిచిన సింగర్ రేవంత్, రన్నర్ అప్ గా నిలిచిన శ్రీహాన్..

బిగ్ బాస్ 6 తెలుగు రియాలిటీ షో ఫైనల్ విన్నర్ గా ప్రముఖ సింగర్ రేవంత్ గెలిచారు. హౌస్ లో ఉన్నటువంటి ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఫైనల్ గా రేవంత్ ఈ సీజన్ యొక్క విన్నర్ గా నిలవగా శ్రీహాన్ రన్నర్ గా నిలిచారు.

Image: Star Maa / Twitter

బిగ్ బాస్ 6 తెలుగు రియాలిటీ షో ఫైనల్ విన్నర్ గా ప్రముఖ సింగర్ రేవంత్ గెలిచారు. హౌస్ లో ఉన్నటువంటి ఐదుగురు కంటెస్టెంట్స్ లో ఫైనల్ గా రేవంత్ ఈ సీజన్ యొక్క విన్నర్ గా నిలవగా శ్రీహాన్ రన్నర్ గా నిలిచారు. వాస్తవానికి ఈ సీజన్‌ టైటిల్‌ను గెలుచుకున్నది శ్రీహాన్, అతడికి రేవంత్ కంటే ఒకశాతం అధికంగా ఓట్లు దక్కాయి. అయితే విన్నర్‌ పేరును ప్రకటించడానికి ముందు నాగార్జున ఇచ్చిన బ్రీఫ్ కేస్ ఆఫర్‌‌ కి శ్రీహాన్ ఓకే చెప్పి 40 లక్షల రూపాయల బ్రీఫ్ కేస్‌ను తీసుకున్నాడు. దీనితో రేవంత్‌ను టైటిల్ విన్నర్‌గా ప్రకటించాల్సి వచ్చిందని నాగార్జున తెలిపారు. కాగా ఫైనల్ విన్నర్‌ అయిన రేవంత్ కు టైటిల్‌తో పాటు ఇంటిస్థలం, 10 లక్షల రూపాయల నగదును బహుమతిగా అందజేశారు. మొత్తంగా బిగ్ బాస్ సీజన్ 6 మంచి జోష్ తో మంచి ఆదరణతో ముగిసింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement