Yasaswi Kondepudi: వివాదంలో చిక్కుకున్న సింగర్ యశస్వి కొండెపుడి, ఎన్జీవో సంస్థ పేరుతో మోసానికి పాల్పడ్డారని నవసేవ పౌండేషన్ నిర్వహకురాలు ఫరా కౌసర్ ఆరోపణలు
సరిగమప విన్నర్ యశస్వి కొండెపుడి వివాదంలో చిక్కుకున్నారు. తనది కాని సంస్థను తనదని చెప్పుకుని మోసానికి పాల్పడ్డాంటూ నవసేవ పౌండేషన్ నిర్వహకురాలు ఫరా కౌసర్ ఆరోపణలు చేశారు. తాను చేయని సామాజిక సేవ గురించి తప్పుడు ప్రచారం చేసుకున్నాడని మండిపడ్డారు.
సరిగమప విన్నర్ యశస్వి కొండెపుడి వివాదంలో చిక్కుకున్నారు. తనది కాని సంస్థను తనదని చెప్పుకుని మోసానికి పాల్పడ్డాంటూ నవసేవ పౌండేషన్ నిర్వహకురాలు ఫరా కౌసర్ ఆరోపణలు చేశారు. తాను చేయని సామాజిక సేవ గురించి తప్పుడు ప్రచారం చేసుకున్నాడని మండిపడ్డారు.
ఇటీవల ఓ షోలో పాల్గొన్న యశస్వి తాను నవసేవ అనే పేరుతో ఎన్జీవో నడుపుతున్నానని, దీని ద్వారా 50 నుంచి 60 మంది పిల్లలను చదివిస్తున్నట్లు చెప్పాడు. అయితే.. ఇది నిజం కాదని ఆ సంస్థ నిర్వాహకురాలు ఫరా కౌసర్ తాజాగా ఆరోపణలు చేస్తున్నారు. బుధవారం ఆమె సోమాజిగూడ ప్రెస్ క్లబ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను చేయని సేవా కార్యక్రమాలను చేసినట్లుగా ఓ టీవీ ఛానల్‌లో యశస్వి ప్రచారం చేశాడని చెప్పారు.
అది తెలిసి వెంటనే తానే స్వయంగా యశస్విని క్షమాపణ చెప్పాలని కోరిన అతడు పట్టించుకోలేదు. ప్రేక్షకుల నుంచి అభిమానం పొందేందుకు చేయని సేవా కార్యక్రమాలను తామే చేస్తున్నట్లు ఎలా ప్రచారం చేసుకుంటారని నిలదీశారు. ఈ విషయంపై తాను ప్రచారం చేసిన టీవీ ఛానల్, సదరు కార్యక్రమానికి వ్యాఖ్యాతక వ్యవహరించిన యాంకర్‌పై, యసస్విపై త్వరలోనే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆమె హెచ్చరించారు.
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)