Bronx Fire Incident: ఘోర అగ్ని ప్రమాదం, 9 మంది చిన్నారులతో సహా 19 మంది సజీవ దహనం, న్యూయార్క్ బ్రాంక్స్ ట్విన్ పార్క్ అపార్ట్‌మెంట్ లో విషాద ఘటన
అమెరికాలోని న్యూయార్క్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు 19 మందిని బలితీసుకున్నాయి. వీరిలో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో 60 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు
అమెరికాలోని న్యూయార్క్‌లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ అపార్ట్‌మెంట్‌లో చెలరేగిన మంటలు 19 మందిని బలితీసుకున్నాయి. వీరిలో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరో 60 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో 13 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈస్ట్ 81 స్ట్రీట్‌లోని 19 అంతస్తులున్న బ్రాంక్స్ ట్విన్ పార్క్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. రెండు, మూడు అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే 200 మంది అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయితే అప్పటికే 19 మంది నిర్జీవంగా మారిపోయారు. గత కొన్నేళ్లలో ఇలాంటి అగ్ని ప్రమాదాన్ని తానెప్పుడూ చూడలేదని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)